పంజాబ్ పై ఢిల్లీ విక్టరీ..లీగ్ లో ఆరో విజయం

పంజాబ్ పై ఢిల్లీ విక్టరీ..లీగ్ లో ఆరో విజయం
  • పంజాబ్‌ ను ఓడించిన క్యాపిటల్స్‌
  • రాణించిన సందీప్‌ , ధవన్‌ , అయ్యర్‌
  • లీగ్‌ లో ఆరో విజయం

ఐపీఎల్ పన్నెండో ఎడిషన్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ఆరో విక్టరీ నమోదు చేసింది. గత మ్యాచ్‌ లో ముంబై చేతిలో కంగుతిన్న ఢిల్లీ గొప్పగా పుంజుకుంది.అంతగా అచ్చిరాని హోమ్‌‌గ్రౌండ్‌ లో ఆల్‌‌రౌం-డ్‌ షోతో అదరగొట్టిం ది. బౌలింగ్‌ లో సందీప్‌ల మిచానె(3/40), బ్యాటింగ్‌ లో శిఖర్‌ ధవన్‌‌( 41బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 56), కెప్టెన్‌‌  శ్రేయస్‌ అయ్యర్‌ (58 ) హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటడంతోఇక్కడి ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌ లో ఢిల్లీ ఐదు వికెట్ల తేడాతో పంజాబ్‌ ను ఓడించింది.

టాస్‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి163 రన్స్‌ చేసింది. యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌‌(37బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69) హాఫ్‌ సెంచరీసత్తా చాటాడు. మన్‌‌దీప్‌ సింగ్‌ ( 30), హర్‌ ప్రీత్‌(20 నాటౌట్‌ ) రాణించగా.. లోకేశ్‌ రాహుల్‌‌(12),మయాంక్‌ అగర్వాల్‌‌(2), డేవిడ్‌ మిల్లర్‌ (7) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో నేపాల్‌‌ యంగ్​స్టర్‌ సందీ ప్‌లమిచానె(3/40) మూడు వికె ట్లు పడగొట్టగా..రబాడ, అక్షర్‌ పటేల్‌‌కు రెండేసి వికెట్లు దక్కాయి.అనంతరం ధవన్‌‌, శ్రేయస్‌ మెరుపులతో క్యాపిటల్స్‌ 19.4 ఓవర్లో ఐదు వికెట్లకు 166 పరుగులుచేసి ఘన విజయం సాధించింది. పృథ్వీ షా (13)త్వరగానే ఔటైనా.. రెండో వికెట్‌ కు 92 పరుగులుజోడించి న ధవన్‌‌ శ్రేయస్‌ పునాది వేశారు. విజయానికి 12 బంతుల్లో పది పరుగులు అవసరమైన దశలో కొలిన్‌‌ ఇంగ్రామ్‌‌(19), అక్షర్‌ పటేల్‌‌ (1) వెంటవెంటనే ఔటవడంతో ఢిల్లీ కాస్త కంగారు పడింది. కానీ,రూథర్‌ ఫర్డ్‌‌ (2 నాటౌట్‌ )తో కలిసి అయ్యర్‌ జట్టును ఒడ్డుకు చేర్చాడు. పంజాబ్‌ బౌలర్లలో విల్జో న్‌‌కు రెండువికెట్లు దక్కాయి

స్కోరు బోర్డు

పంజాబ్ : రాహుల్(స్టంప్డ్​) పంత్‌ (బి)లమిచానె 12, గేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సి) అక్షర్‌ (బి)లమిచానె69, మయాం క్‌ (సి)రూథర్‌ ఫర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) రబా డ2, మిల్లర్‌ (సి) షా (బి) అక్ష ర్‌ 7, మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీ ప్‌ (-స్టం ప్‌ ) పంత్‌ (బి) అక్షర్‌ 30, కరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సి అండ్‌బి) లమిచానె 0, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సి)శ్రేయస్‌ (బి)రబాడ 16, హర్‌ ప్రీత్‌ (నాటౌట్‌ ) 20, విల్జో న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌ ) 2;

ఎక్స్‌ ట్రాలు: 5 ; మొత్తం: 20ఓవర్లలో 163/7;

వికెట్ల పతనం : 1–13,2–42, 3–61, 4 –106, 5–106, 6–129,7–151 ; బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇషాంత్‌ 4–0–29–0,లమిచానె 4– 0– 40–3, రబాడ 4–0–23–2, మిశ్రా 4–0– 41–0, అక్షర్‌ 3–0–22–2,రూథర్‌ ఫర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1–0–5–0.

ఢిల్లీ: పృథ్వీ (రనౌట్‌ )13, , ధవన్‌‌(సి)అశ్విన్‌‌(బి)విల్జో న్‌‌ 56, శ్రేయస్‌ ( నాటౌట్)58,పంత్‌ (సి) కరన్‌‌ (బి) విల్జో న్‌‌ 6, ఇంగ్రామ్‌‌ (బి) షమి 19, అక్షర్​(రనౌట్) 1, రుథర్ఫర్డ్​(నాటౌట్)2,

ఎక్స్‌ ట్రాలు: 11;మొత్తం: ఓవర్లలో 19.4 ఓవర్లలో 166/4.

వికెట్లపతనం : 1–24, 2–116, 3–128,4–155,5–156, బౌలింగ్‌‌: షమి 4–0–21–1,కరన్‌‌ 3.4–0–34–0, విల్జో న్‌‌ 4–0–39–2,హర్‌ ప్రీత్‌ 2–0–24–0, అశ్విన్‌‌ 3–0–26–0, మురుగన్‌‌ 3–0–20–0.