ఢిల్లీ బ్లాస్ట్ మిస్టరీ..పేలుడుకు ముందు మెడికల్ కాలేజీలో 11 రోజులుగా కారు..ఉగ్ర కుట్ర వెనక రహస్యం ఏంటీ ?

ఢిల్లీ బ్లాస్ట్ మిస్టరీ..పేలుడుకు ముందు మెడికల్ కాలేజీలో 11 రోజులుగా కారు..ఉగ్ర కుట్ర వెనక రహస్యం ఏంటీ ?

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడులో సంచలన విషయాలు..బ్లాస్ట్​ కు కొన్ని రోజుల ముందు ఆ కారును ఫరీదాబాద్​ మెడికల్​ కాలేజీలో పార్క్​ చేయడం వెనక అసలు రహస్యం ఏంటీ..? ప్లాన్​ ప్రకారమే పదకొండు రోజులుగా కారును అక్కడ పార్కింగ్ చేశారా? పేలుడు పదార్థాలు ఉంచి కారును యూనివర్సిటీలో ఉంచారా?  అక్కడ ఉందుకు ఉంది..పేలుడుకు కొన్ని గంటల ముందు ఢిల్లీ వీధుల్లో ఎందుకు చక్కర్లు కొట్టింది..? 

ఢిల్లీ ఎర్ర కోటలో కారు పేలుడు జరిగిన రెండ్రోజుల తర్వాత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూసైడ్​ బాంబర్​ గా అనుమానిస్తున్న డాక్టర్​ ఉమర్​ మహ్మద్​ నవీ కారును పేలుడుకు 11 రోజుల ముందు యూనివర్సిటీలో పార్కింగ్​ చేయడం పలు అనుమానాలు తలెత్తున్నాయి.  నవంబర్​ 10న ఫరీదాబాద్​ లోని అల్​ ఫలాహ్​ మెడికల్ కాలేజీ క్యాంపస్​ నుంచి తెల్లటి హ్యుందాయ్​ i20 కారును భయం భయంగా  ఎందుకు నడుపుతూ కనిపించడంపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. 

అక్టోబర్​ 29 న ఓ కారు డీలర్​నుంచి వాహనాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. పేలుడుకు కొన్ని గంటల ముందు కారును పీయూసీ సెంటర్లో పొల్యూషన్​ చెకింగ్ చేయించినట్లు సీసీఫుటేజ్​లో రికార్డయ్యింది. అనంతరం ఆకారును మెడికల్ కాలేజీ క్యాంపస్​ లో డాక్టర్​ ముజమ్మిల్​ షకీల్​స్విఫ్ట్​డిజైర్​కారు పక్కన పార్కింగ్​ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ముజమ్మిల్​ షకీల్​ ను అరెస్ట్​ చేసిన పోలీసులు.. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. షకీల్ కారు పక్కన డాక్టర్​ ఉమర్​ మహ్మద్​ నబీ కారు పార్కింగ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

తాజా రిపోర్టుల ప్రకారం.. డాక్టర్ షకీల్ ,డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ అరెస్టు తర్వాత డాక్టర్ నబీ హ్యుందాయ్ i20 కారును పార్కింగ్ స్థలం నుంచి బయటకు తీసుకెళ్లినట్లు సీసీపుటేజ్​ లో రికార్డయింది. 

సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నబీ కారు ఢిల్లీలో ఏయే ప్రాంతాల్లో తిరిగింది.. ఎక్కడెక్కడ ఎంత సమయం ఆగింది గుర్తించారు. పేలుడుకు 11 గంటల ముందు నబీ కారు ఫరీదాబాద్ నుంచి ఎర్రకోటకు బయలుదేరింది. సోమవారం(నవంబర్​10) ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఫరీదాబాద్‌లోని ఏషియన్ హాస్పిటల్ వెలుపల కారు మొదటిసారి కనిపించినట్లు సీసీటీవీల్లో రికార్డయ్యింది. 

సంఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో చాందిని చౌక్‌లోని సునేహ్రీ మసీదు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించింది సూసైబ్​ బాంబర్​ నబీ కారు. అంతకుముందు కారు కన్నాట్ ప్లేస్ ,మయూర్ విహార్‌లలో కూడా కనిపించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఛటా రైల్ చౌక్ లో యు-టర్న్ తీసుకొని లోయర్ సుభాష్ మార్గ్ వైపు కదిలినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు కారు నెమ్మదిగా కదులుతున్నప్పుడు అక్కడ పేలిపోవడం సిసిటివి ఫుటేజ్‌లో రికార్డైంది.ఈ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయపడ్డారు.

డాక్టర్ ముజమ్మిల్ షకీల్,డాక్టర్ ఆదిల్ రాథర్ అరెస్టులు ,పేలుడు పదార్థాలను స్వాధీనం తర్వాత అనుమానిత ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ భయంతో  ఆత్మాహుతికి పాల్పడి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. 

పేలుడు జరిగి ప్రదేశంలో ఎటువంటి గుంతలు ఏర్పడకపోవడం ఇది ప్రమాదవశాత్తు పేలుడు జరిగి ఉండవచ్చునని అనుమానాలకు తావిస్తోంది. అనుమానితులు తరలిస్తున్నప్పుడు లేదా పేలుడు పదార్థాలను పారవేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పేలుడు సంభవించిందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.