ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా

ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈడీ చట్టవిరుద్ధంగా కేజ్రీవాల్ కు నోటీసులు పంపిందని ఆరోపించింది.  ఢిల్లీలో ఆప్ గవర్నమెంట్ ను పడగొట్టడానికి ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు ఆప్ నేతలు. బీజేపీ కుట్రలు ఢిల్లీలో కొనసాగవని హెచ్చరించారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది.  వివిధ కారణాలతో నాలుగు సార్లు కూడా విచారణకు హాజరుకాలేదు కేజ్రీవాల్. దీంతో ఇటీవల ఐదోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపింది. అయితే, ఇప్పుడు కూడా ఆయన ఈడీ విచారణకు హాజరుకావడం లేదు. దీంతో కేజ్రీవాల్ నిర్ణయంపై ఈడీ ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది.