ఢిల్లీలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ బ్యాంకు సేవలు, హోం డెలివరీ 

ఢిల్లీలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ బ్యాంకు సేవలు, హోం డెలివరీ 

కరోనా బాధితులకు మరిన్ని వైద్య సౌకర్యాలు చేపట్టేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ బ్యాంకును ఇవాళ్టి(శనివారం, మే-15) నుండి ప్రారంభించినట్లు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. సమర్థవంతమైన కరోనా చికిత్స నిమిత్తం అవసరమయ్యే రోగులకు సరఫరా చేసేందుకు వీటిని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హోం ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి హోం డెలివరీ చేయనున్నట్లు తెలిపారు.

ప్రతి జిల్లాలో 200 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను ఉంచుతామన్నారు సీఎం కేజ్రీవాల్. మెడికల్‌ ఆక్సిజన్‌ అందుబాటు లేక కొవిడ్ పేషెంట్లు ఐసియులో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కొంత మంది అయితే చినపోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ అడ్డంకులన్నింటీ తొలగించేందుకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ బ్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి దీన్ని హోం డెలివరి చేస్తామని, ఎలా వినియోగించాలనేది కూడా దీనికి సంబంధించిన సిబ్బంది చెబుతారన్నారు. డాక్టర్లు కూడా  పేషంట్లతో టచ్‌లోనే ఉంటారని, ఒక వేళ ఆస్పత్రిలో చేరాల్సి ఉంటే...సకాలంలో చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీని కోసం హెల్ప్ లైన్ నంబర్-1031కు డయల్‌ చేయాలని సూచించారు సీఎం కేజ్రీవాల్ .