ఢిల్లీ లిక్కర్ స్కాం: అమిత్  అరోరాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం: అమిత్  అరోరాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ : లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారి అమిత్ అరోరాను  ఢిల్లీ రౌస్ అవెన్యూలోని  సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అమిత్ ను డిసెంబరు 28 వరకు కస్టడీకి పంపుతూ సీబీఐ స్పెషల్ కోర్టు స్పెషల్ జడ్జి ఎన్.కె.నాగ్ పాల్ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు 14 రోజుల పాటు అమిత్ అరోరాను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) .. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టింది.  

అమిత్ అరోరా ఇంకా తమ కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని ఈడీ తరపు న్యాయవాది, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.కె.మట్టా తెలపడంతో కోర్టు తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరో అరెస్టు అమిత్ అరోరాదే. మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలతో ఆయనను ఈడీ అరెస్టు చేసింది.