ఢిల్లీలో ఫైర్ ఇంజన్ కోసం ఒక్కరోజులోనే 220 ఫోన్ కాల్స్

ఢిల్లీలో ఫైర్ ఇంజన్ కోసం ఒక్కరోజులోనే 220 ఫోన్ కాల్స్

దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి చేరుతున్నాయి. మే 29న నగరంలో 50 డిగ్రి సెల్సియస్ లుగా నమోదైంది. తీవ్ర ఎండ, హీట్ వేవ్ కారణంగా అగ్ని ప్రమాదాలు వివరీతంగా జరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఫైర్ సిబ్బందికి 220 ఫోన్ కాల్స్ వచ్చాయి. గత 10సంవత్సరాల్లో  ఇన్ని కాల్స్ రావడం ఇదే మొదటిసారి అని అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. ఢిల్లీలో మే నెలలోనే 12మంది వరకు వివిధ అగ్ని ప్రమాదాల్లో చనిపోయారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్లనే ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని నగరాలు మరియు పట్టణాలు 47 డిగ్రీల సెల్సియస్‌కు మించి గరిష్ట ఉష్ణోగ్రతల వద్ద రోహ్‌తక్ మరియు ప్రయాగ్‌రాజ్‌లో 48.8 డిగ్రీలు నమోదయ్యాయి, ఇది బుధవారం దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.