రిపోర్టర్ల దెబ్బకు.. వరదల్లో చూస్తూ ఉండిపోయిన NDRF రెస్క్యూ టీమ్స్

రిపోర్టర్ల దెబ్బకు.. వరదల్లో చూస్తూ ఉండిపోయిన NDRF రెస్క్యూ టీమ్స్

లైవ్‌ రిపోర్టింగ్ పేరుతో   రిపోర్టర్లు ఇలా వింతగా ప్రవర్తిస్తుండడం కొత్తేమి కాదు. ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయు. ఓ జర్నలిస్ట్ పీకల్లోతు నీళ్లలో  లైవ్‌గా ఉంటుందని వరద నీళ్లలో నిలబడి రిపోర్టింగ్ చేసిన వైనం జర్నలిస్ట్ లోకాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గ్రేట్ రిపోర్టింగ్ అని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరేమో ఇలా వరద ప్రవాహంలోకి దిగి రిపోర్టింగ్ చేయాల్సిన సీన్ లేదంటూ విమర్శలు చేస్తున్నారు.

దేశ రాజధానిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా యమునా నది నీటిమట్టం పెరగడం మరియు పొరుగున ఉన్న హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుండి నీటిని విడుదల చేయడంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.ఈ క్రమంలో   వరదల్లో చిక్కుకు పోయిన జనాలను రక్షించేందుకు, సహాయం చేసేందుకు  ఎన్డీఆర్ ఎఫ్ బలగాలు సిద్దంగా ఉన్నాయి.  అయితే ఇప్పుడు ఓ లేడీ జర్నలిస్ట్ అత్యుత్సాహం ప్రదర్శించి.. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఉపయోగించే సేప్టీ ట్యూబ్ తో నీళ్లలోకి వెళ్లి రిపోర్టింగ్ చేస్తుంది.   కొంతమంది NDRF సిబ్బంది  ఆమె లైవ్ రిపోర్టింగ్ ను సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. NDRF సేఫ్టీ ట్యూబ్ ఇచ్చింది వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కాని ఇలా వైరల్ వీడియోలు చేయడానికి కాదని కామెంట్లు పెడుతున్నారు. 

రత్తన్ ధిల్లాన్ అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక మహిళా జర్నలిస్ట్ నీటిలో మునిగిపోకుండా తన శరీరం చుట్టూ సేఫ్టీ ట్యూబ్‌ని ధరించి ..వరద నీటిలో  పీకల్లోతు వరదతో నిలబడి లైవ్ రిపోర్టింగ్ చేస్తుంది.  కొంతమంది NDRF సిబ్బంది రెస్క్యూ బోట్‌లో  ఒకరు  వీడియోను చిత్రీకరించారు. మరొక NDRF సిబ్బంది జర్నలిస్ట్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కెమెరాకు పోజులిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. 

 

ధిల్లాన్ ఈ  వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, "ఇది ఎలాంటి వార్తల రిపోర్టింగ్? ఆమె NDRF వాలంటీర్‌ని కేవలం రిపోర్టింగ్ కోసం స్వార్థ ప్రయోజనాలకు వాడుకుందని రాశారు.NDRF సిబ్బంది  సహాయం చేయకుండా ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న పరిమిత పడవలు ఉన్నాయని.. వాటిని ఇలా ఉపయోగిస్తున్నారని .. క్షమించండి మాకు ఇలాంటి వార్తలు వద్దు అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. 

వీడియో వైరల్ అయిన వెంటనే..  NDRF పరికరాలను ఉపయోగించినందుకు రిపోర్టర్‌ను విమర్శిస్తూ  నెటిజన్లు ధిల్లాన్  కామెంట్ బాక్స్‌లో కామెంట్లు పోస్ట్ చేశారు. కొంతమంది ఆమె రిపోర్టింగ్ తో పాటు ఆ ఛానల్ ను కూడా విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటి జోకర్లను నిషేధించాలని ఒక వినియోగదారుడు రాశారు. మరో వినియోగదారు జర్నలిస్టు పట్ల శ్రద్ధ చూపుతూ విభిన్నమైన విమర్శలను తీసుకున్నాడు, మురుగు నీటిలో, ఆమెకు రాబోయే కొద్ది రోజులకు యాంటీ బయోటిక్ క్రీమ్ చాలా అవసరం" అని వ్యాఖ్యానించారు. ఈ రిపోర్టింగ్ కేవలం దయనీయమైనది, అని మరొకరు ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. ఇంకొక  వినియోగదారుడు.. ఇటువంటి కవరేజీ కోసం వార్తా ఛానెల్‌ను దూషిస్తూ, "ఆమె ఏ ఛానెల్? దయనీయమైన వార్తా ఛానెల్ మరియు రిపోర్టర్. వారు తమ పనిని సరిగ్గా చేసి, ఢిల్లీలో ఏ రహదారి మూసివేయబడింది మరియు ఎక్కడ తెరిచి ఉందో ప్రజలకు చెప్పాలి. ఇడియట్స్ స్వయంగా వెళ్లి నీటిలో కూర్చున్నారు" అని ఒక వినియోగదారు వరద నీటిలో చేసిన లైవ్ రిపోర్టింగ్ ను  ఎగతాళి చేశారు