యెస్​పై బ్యాంకుపై వేసిన పిటిషన్ ​వెనక్కి.. సుబ్రమణ్యస్వామికి కోర్టు గ్రీన్​సిగ్నల్

యెస్​పై బ్యాంకుపై వేసిన పిటిషన్ ​వెనక్కి.. సుబ్రమణ్యస్వామికి కోర్టు గ్రీన్​సిగ్నల్

న్యూఢిల్లీ: రూ.48,000 కోట్ల స్ట్రెస్ అసెట్ పోర్ట్‌‌‌‌ఫోలియోను యెస్ బ్యాంక్ నుండి జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీకి బదిలీ చేయడంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది.  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌‌‌‌ను ఉపసంహరించుకోవడంపై పార్టీ నుంచి అభ్యంతరం లేదని గమనించి, ఈ అంశంపై తదుపరి విచారణను రద్దు చేసింది. 

ప్రస్తుత రిట్ పిటిషన్​ను ఉపసంహరించుకున్నందున కొట్టివేస్తున్నామని జస్టిస్ మినీ పుష్కర్‌‌‌‌లతో కూడిన ధర్మాసనం నవంబర్ 22 న ప్రకటించింది. అసెట్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీలకు లైసెన్సింగ్ నిర్వహణ కోసం ఆర్​బీఐ మార్గదర్శకాలను జారీ చేసినట్టు పిటిషనర్​ చెప్పారని పేర్కొంది.   బ్యాంకులు/ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ లేదా ఇతర ఆర్థిక సంస్థలు, ఏఆర్‌‌‌‌సీల మధ్య కుదిరిన ఏర్పాట్లను నియంత్రించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని ఆదేశించాలని కోరుతూ స్వామి ఈ ఏడాది ప్రారంభంలో హైకోర్టును ఆశ్రయించారు.