కేజ్రీవాల్‌‌ సీబీఐ అరెస్ట్‌‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వాయిదా

కేజ్రీవాల్‌‌ సీబీఐ అరెస్ట్‌‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వాయిదా

న్యూఢిల్లీ : లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌లో సీబీఐ తనను అరెస్ట్‌‌ చేయడాన్ని సవాల్‌‌ చేస్తూ, మధ్యంతర బెయిల్‌‌ను కోరుతూ ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్‌‌ దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం తన తీర్పును జులై 29కి వాయిదా వేసింది. సింగిల్‌‌ జడ్జి బెంచ్‌‌ జస్టిస్‌‌ నీనా బన్సల్‌‌ పిటిషన్లపై విచారించారు. కేజ్రీవాల్‌‌ న్యాయవాది అభిషేక్‌‌ మను సింఘ్వీ వాద నలు వినిపిస్తూ.. కేజ్రీవాల్‌‌ను అరెస్ట్‌‌ చేయాలన్న ఉద్దేశం గానీ, ఆధారాలు గానీ సీబీఐ వద్ద లేవన్నారు.

సీఐబీ తర ఫున స్పెషల్‌‌ పీపీ డీపీ సింగ్‌‌ వాదిస్తూ.. సీఎంను ఎప్పుడు ప్రశ్నించాలో, ఎప్పుడు ప్రశ్నించకూడదో.. నిర్ణయించే హక్కు సీబీఐకి ఉందన్నారు. విచారణ సమ యంలో నిందితులను నిందించడం వల్ల విచారణను అడ్డుకునేందుకు కేజ్రీవాల్‌‌ ప్రయత్నిస్తున్నారని సింగ్ ఆరోపించారు