రతన్ టాటాకు భారతరత్న పిల్ తిరస్కరణ

రతన్ టాటాకు భారతరత్న పిల్ తిరస్కరణ

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి మార్గదర్శనం చేయాలంటూ దాఖలైన పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్ను అనుమతించేందుకు నిరాకరించింది. ఈ పిల్పై విచారణ జరిపిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లాతో కూడిన ధర్మాసనం.. ఒక వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని కోర్టు ఆదేశించలేదని స్పష్టంచేసింది. అసలు ఇదేం పిటీషన్? భారత రత్న అవార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి న్యాయస్థానం మార్గదర్శనం చేయగలదా అని కోర్టు ప్రశ్నించింది. పిల్ కొట్టివేస్తామని ధర్మాసనం చెప్పడంతో పిటీషనర్ తరఫు న్యాయవాది దాన్ని ఉపసంహరించుకున్నారు. 

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ రాకేశ్ అనే సామాజిక కార్యకర్త ఓ పిటీషన్ దాఖలు చేశారు. ఆయన దేశ అత్యున్నత పురస్కారం అందుకునేందుకు ఎందుకు అర్హుడన్న అంశాలను అందులో పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎన్నో విద్యా సంస్థలను టాటా గ్రూప్ నెలకొల్పిందని, సమాజ సేవలో టాటా సంస్థలు ఎనలేని కృషి చేస్తున్నాయని పిటిషనర్ స్పష్టం చేశారు. టాటా ట్రస్ట్ కరోనా సమయంలో రూ.1500 కోట్లకుపైగా ఖర్చు చేసి పేదలకు సాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దశాబ్దాలుగా వేల మందికి టాటా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నారని అలాంటి సంస్థకు చైర్మన్ గా ఉన్న రతన్ టాటాకు కేంద్రం భారతరత్న ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.

 మరిన్ని వార్తల కోసం..

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు

కొందరు పోతుంటరు.. కొందరు వస్తుంటరు