
న్యూఢిల్లీ: బాలీవుడ్‌నటి జూహీచావ్లాపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఆర్నెళ్ల క్రితం ఆమె పిటిషన్ వేయగా.. దాన్ని ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ గత జూన్‌లో కొట్టేసింది. దాంతో పాటు ఫైన్ విధించింది. ఇన్నాళ్ల తర్వాత ఆ తీర్పును సవాల్ చేస్తూ జుహీ తాజాగా అప్పీల్ దాఖలు చేశారు. అయితే తీర్పుపై ఇంత లేట్‌గా అప్పీల్ చేయడంపై జస్టిస్ విపిన్ సంఘీ అసహనం వ్యక్తం చేశారు. జూన్‌లో తీర్పు వెలువరించాం. ఆరు నెలల తర్వాత ఇప్పుడు వచ్చారా? అని సీరియస్ అయ్యారు. ఆ తర్వాత అప్పీల్‌ను స్వీకరించారు. ప్రస్తుతం పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున వచ్చే ఏడాది జనవరిలో విచారణ చేపడతామని జడ్జి వెల్లడించారు.