ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్పై విచారణ

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్పై విచారణ

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను బుధవారం (జూలై 17) ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. మునుపటి విచారణ జూలై 2 న జరిగింది. విచారణ సందర్భంగా జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఏడు రోజుల్లో స్పందించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ని ఆదేశించారు. తన మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. కేజ్రీవాల్ జూలై 1న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సీబీఐ జ్యుడిషియల్ కస్టడీ  ఉన్నారు సీఎం కేజ్రీవాల్. జూలై 25 వరకు కస్టడీ కొనసాగుతుంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే నిర్భంధంలో ఉన్న కేజ్రీవాల్ జూన్ 26న తీహార్ జైలు నుంచి అరెస్ట్ చేశారు. దీనికి ముందు మార్చి 21న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి రాస్ అవెన్యూ కోర్టు  రిమాండ్ పంపింది. 

లిక్కర్ స్కాంలో ఈడీ కేసులో సుప్రీంకోర్టు జూలై 12న కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం పెద్ద బెంచ్ కు బదిలీ చేసింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ..  పిటిషన్ ఫలితంపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. మరోవైపు ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేయలేమని ఆ నిర్ణయాన్ని కేజ్రీవాల్ కే వదిలేస్తున్నానమి కోర్టు స్పష్టం చేసింది.