ఓపెన్ బుక్ పరీక్షలకు గ్రీన్ సిగ్నలిచ్చిన ఢిల్లీ హైకోర్టు

ఓపెన్ బుక్ పరీక్షలకు గ్రీన్ సిగ్నలిచ్చిన ఢిల్లీ హైకోర్టు

డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్ ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. అయితే పరీక్ష ఎలా నిర్వహించాలో చెబుతూ కొన్ని మార్గదర్శకాలను హైకోర్టు జారీ చేసింది. యూనివర్సిటి నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10, 2020 సోమవారం నుండి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు.

యూనివర్సిటీ గతంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆన్‌లైన్ మోడ్‌లో ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్‌ వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. చాలా మంది విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలను రాయడానికి సరైన సదుపాయాలు లేవని మరియు చాలామందికి సాంకేతిక సమస్యలను వస్తాయని పిటిషన్ లో తెలిపారు. ఆ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి.. యూనివర్సిటి నిర్ణయానికి అనుమతించారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్స్ ఆగస్టు 10 నుండి ఆగస్టు 31 వరకు జరుగుతాయి. అయితే ఏవైనా కారణాల వల్ల ఆన్‌లైన్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో మరోసారి పరీక్షలకు హాజరుకావడానికి అవకాశం ఇవ్వబడుతుంది.

ఆన్‌లైన్ ఓపెన్ బుక్ మోడ్ లో పరీక్షలు నిర్వహించడానికి హైకోర్టు కొన్ని షరతులు విధించింది. అవి.. ప్రశ్నపత్రాన్ని పోర్టల్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ప్రశ్నపత్రం ఇమెయిల్ లో పంపాలి. విద్యార్థులకు జవాబు పత్రాలను అప్‌లోడ్ చేయడానికి ఒక గంట అదనపు సమయం ఇవ్వాలి. అప్‌లోడ్ చేసే సమయంలో సాంకేతిక లోపాలు వస్తే.. జవాబు పత్రాలను ఇమెయిల్ చేయడానికి అనుమతించాలి. విద్యార్థులకు వారి జవాబు పత్రాలు వచ్చాయని తెలియజేస్తూ రిటర్న్ మెసెజ్ చేయాలి.

For More News..

కరోనా దెబ్బకి ఉద్యోగులకు బంపర్ ఆఫరిచ్చిన ఫేస్ బుక్

‘ఇండియన్ 2’ ప్రమాద బాధితులకు రూ. కోటి చెక్కులిచ్చిన కమల్ హాసన్

వీడియో పోస్ట్ చేసి మరో నటి ఆత్మహత్య