Liquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ

Liquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరుపుతోంది. ఈడీ అధికారులు అభిషేక్, విజయ్ నాయర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, శరత్ చంద్రారెడ్డిని కోర్టు హాలులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం ఇరు పక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. అనంతరం న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించనున్నారు.

లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి శరత్ చంద్రారెడ్డిని ఈడీ  గతేడాది నవంబర్ 10న అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు బినోయ్ బాబును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు తీహార్ జైలులో ఉన్నారు. సౌత్ గ్రూప్ లావాదేవీల్లో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, బినోయ్ బాబు కీలకంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ శరత్ చంద్రారెడ్డి సహా మరికొందరిపై జనవరి 6న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఆధారాలను  సప్లమెంటరీ చార్జీ షీట్లో ఈడీ పొందుపరిచింది.