రంజిట్రోఫీలో హైదరాబాద్‌‌‌‌ డ్రాతో ముగింపు

 రంజిట్రోఫీలో  హైదరాబాద్‌‌‌‌  డ్రాతో ముగింపు

హైదరాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీని హైదరాబాద్ డ్రాతో ముగించింది. గ్రూప్‌‌‌‌–డిలో భాగంగా జింఖానా గ్రౌండ్‌‌‌‌లో ఆదివారం ముగిసిన తమ చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌లో చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌తో డ్రాతో సరిపెట్టుకుంది. ఫస్ట్ లీడ్ ఆధారంగా మూడు పాయింట్లు అందుకుంది. 248 రన్స్‌‌‌‌ లోటుతో ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 100/2తో చివరి రోజు ఆట కొనసాగించిన చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ మ్యాచ్ చివరకు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 411/8 చేసి మ్యాచ్‌‌‌‌ను డ్రా చేసుకుంది. 

కెప్టెన్ అమన్‌‌‌‌దీప్ ఖారె (176 నాటౌట్) భారీ సెంచరీతో జట్టుకు ఓటమి తప్పించాడు. అనుజ్‌‌‌‌ తివారీ (88), దేవ్‌‌‌‌ ఆదిథ్య సింగ్ (79 నాటౌట్) రాణించారు. తనయ్ త్యాగరాజన్ (3/114), అనికేత్ రెడ్డి (3/147)  దెబ్బకు చత్తీస్‌‌‌‌గఢ్ ఓ దశలో 218/8తో ఇన్నింగ్స్ ఓటమి అంచుల్లో నిలిచింది. కానీ, దేవ్‌‌‌‌ ఆతిథ్యతో కలిసి తొమ్మిదో వికెట్‌‌‌‌కు అజేయంగా 193 రన్స్ జోడించిన అమన్‌‌‌‌దీప్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది. 7 మ్యాచ్‌‌‌‌ల్లో ఒకే విజయం సాధించిన హైదరాబాద్‌‌‌‌ (16 పాయింట్లు) గ్రూప్‌‌‌‌–డిలో నాలుగో ప్లేస్‌‌‌‌తో ఈ సీజన్‌‌‌‌ను ముగించింది.