ఢిల్లీ లిక్కర్ స్కాం: బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నగదు తరలింపు!

ఢిల్లీ లిక్కర్ స్కాం: బేగంపేట ఎయిర్  పోర్ట్ నుంచి నగదు తరలింపు!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి ప్రైవేట్ ఛార్టర్ విమానాల ద్వారా నగదును తరలించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి జెట్ సెట్ గో చార్టర్ విమానాల ద్వారా నగదు తరలించినట్లు భావిస్తున్నారు. జెట్ సెట్ గో సంస్థపై ఈడీ ఆరా తీస్తోంది. జెట్ సెట్ గో కార్యకలాపాలపై వివరాలు ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేఖలు రాసింది. 



జెట్ సెట్ గో కార్యకలాపాలు, లావాదేవీల డేటాను ఇప్పటికే ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్లిన వారి జాబితాను ఈడీ సేకరించినట్లు సమాచారం. బేగంటపేట ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ లేకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో ఎయిర్ పోర్ట్ ఉండటంతో.. నేరుగా రన్ వే పైకి వీఐపీల వాహనాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వీఐపీలతో కలిసి లిక్కర్ స్కామ్ సూత్రధారులు డబ్బు తరలించినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల అండతోనే స్కాం జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును ఈడీ అధికారులు అరెస్టు చేశారు.