
గువాహటి: హైదరాబాద్ యంగ్ షట్లర్ జ్ఞాన దత్తు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన బాయ్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో జ్ఞాన దత్తు 11–15, 15–6, 15–11తో సూర్యాక్ష్ రావత్‌పై చెమటోడ్చి నెగ్గాడు. హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన దత్తు తర్వాతి రెండు గేమ్‌ల్లో అద్భుతంగా పుంజుకున్నాడు. బలమైన స్మాష్‌లు, ర్యాలీలు కొడుతూ ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు.
ఇతర మ్యాచ్‌ల్లో రౌనక్ చౌహాన్ 11-–15, 12–-15తో లీ జి హంగ్ (చైనా) చేతిలో, లాల్తాజువాలా హమర్ 13-–15, 6–-15తో రియాన్ మల్హాన్ (యూఏఈ) చేతిలో ఓడారు. గర్ల్స్ సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్, టాప్ సీడ్ తన్వి శర్మ 15–12, 15–7తో ఒయీ వినార్టో (ఇండోనేసియా)పై గెలవగా, ఎనిమిదోసీడ్ ఉన్నతి 15–8, 15–5తో అలైస్ వాంగ్ (అమెరికా)ను ఓడించింది. మరో మ్యాచ్‌లో పదోసీడ్ రక్షిత శ్రీ 11–15, 15–8, 15–5తో అలియా జకారియా (సింగపూర్)పై గెలిచింది.
విమెన్స్ డబుల్స్‌లో అన్యా బిస్త్–ఎంజెల్ పెనెరా 14–16, 15–12, 5–15తో హు సిన్ హుయాంగ్–పీ చున్ సాయ్ (చైనీస్‌తైపీ)పై, కలగోట్ల వెన్నెల–రేష్మిక 15–8, 15–10తో సయాక ఎన్మోటో–మికు యషిమా (జపాన్)పై గెలవగా, గాయత్రి రావత్–మాన్సా రావత్ 6–15, 7–15తో టాన్ కి జువాన్–వీ యు యు (చైనా) చేతిలో ఓడారు.
మెన్స్ డబుల్స్‌లో భార్గవ్ రామ్ అరిగెల–విశ్వ తేజ్ గొబ్బూరు 11–15, 15–10, 15–10తో షుంకి హగివార–మహిరో ముట్సుమోటో (జపాన్)ను ఓడించి ముందంజ వేశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భవ్య చాబ్రా–విశాఖ టొప్పో 15–13, 15–11తో అస్కీ రోమెర్–జాస్మిన్ విల్స్ (డెన్మార్క్) గెలవగా, లాల్‌రామ్‌సంగా–తారిణి సూరి 10–15, 6–15తో షుజి సవాడా–అయో బన్నో (జపాన్) చేతిలో ఓడారు.