ఎయిర్టెల్తో ఐబీఎం జోడీ

ఎయిర్టెల్తో ఐబీఎం జోడీ
  • క్లౌడ్ మల్టీజోన్​ రీజియన్స్​ ఏర్పాటు

న్యూఢిల్లీ:  యూఎస్​ ఐటీ కంపెనీ ఐబీఎం ఎయిర్​టెల్​ క్లౌడ్​ కోసం ముంబై, చెన్నైలో రెండు కొత్త మల్టీజోన్​ రీజియన్స్​ను నిర్మిస్తుంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది.  ఈ భాగస్వామ్యం వల్ల ఎయిర్​టెల్​ క్లౌడ్​ సామర్థ్యాలు పెరుగుతాయి.  

మల్టీజోన్​ రీజియన్ల ఏర్పాటుతో భారత్​లో ఎయిర్​టెల్​ క్లౌడ్​ జోన్ల సంఖ్య నాలుగు నుంచి పదికి పెరుగుతుంది. బ్యాంకింగ్​, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం వంటి రంగాలలో మిషన్ ​-క్రిటికల్​ అప్లికేషన్ల కోసం ఎయిర్​టెల్​ క్లౌడ్​ కస్టమర్లు ఐబీఎం​ పవర్​ సిస్టమ్స్​ పోర్ట్​ఫోలియోను ఉపయోగించుకోవచ్చని ఎయిర్​టెల్​ సీఈఓ విఠల్​ చెప్పారు.