ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఇంకిన్ని చార్జ్ షీట్లు నమోదు చేస్తం

ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఇంకిన్ని చార్జ్ షీట్లు నమోదు చేస్తం
  • సప్లిమెంటరీ చార్జ్ షీట్లను పరిగణనలోకి తీసుకొనే అంశంపై తీర్పు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో మరిన్ని సప్లమెంటరీ చార్జ్ షీట్లు దాఖలు చేస్తామని సీబీఐ.. ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు తెలిపింది. ఈడీ, సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ల వ్యవహారం శుక్రవారం కోర్టు ముందుకు వచ్చింది. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్​ను పరిగణలోనికి తీసుకునే అంశంపై నిర్ణాయన్ని మే 27న, ఈడీ సప్లిమెంటరీ చార్జ్ షీట్​ను పరిగణనలోకి తీసుకునే అంశంపై నిర్ణయాన్ని మే 30 న వెల్లడిస్తామని స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది.

తొలుత ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, ఇతర నిందితులు అర్జున్ పాండే, అమన్ దీప్ పై ఏప్రిల్ 25న సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్​పై స్పెషల్ జడ్జి నాగ్ పాల్ వాదనలు విన్నారు. లిక్కర్ పాలసీలో ఎక్స్​పర్ట్ కమిటీ సూచనలను పక్కన పెట్టి, మార్చి 2020–21న సిసోడియా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రిపోర్టును ఫైనలైజ్ చేశారని సీబీఐ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఎవిడెన్స్​ను సిసోడియా ఆఫీసులోని కంప్యూటర్ నుంచి తీసుకున్నట్లు తెలిపింది.

సిసోడియాను విచారించేందుకు అనుమతి తీసు కున్నామని, అప్పటి ఆబ్కారీ కమిషనర్ అరవ గోపీ కృష్ణ పేరును కూడా అనుమానితుడిగా చార్జిషీట్‌‌‌‌లో పేర్కొన్నామని ప్రస్తావించింది. సప్లిమెంటరీ చార్జిషీట్‌‌‌‌తో పాటు సాక్షుల జాబితా, డాక్యు మెంట్లు, ఆర్టికల్స్​ను జత చేసినట్లు తెలిపింది. మనీలాండరింగ్ కేసులోనూ సిసోడియా పాత్రపై పలు ఆరోపణలు చేసింది. కాగా, ఈ కేసులోని నింది తుడు అమిత్ అరోరా బెయిల్ పిటిషన్​పై విచారణను కోర్టు ఈ నెల 25 కు వాయిదా వేసింది.