ఢిల్లీలో సరి-బేసి విధానంలో మాల్స్, మార్కెట్లు ఓపెన్

V6 Velugu Posted on Jun 05, 2021

ఢిల్లీలో కరోనా కేసుల నమోదు అదుపులోకి రావడంతో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఢిల్లీలో రోజువారి కేసులు 400 కన్నా తక్కువే వచ్చాయని.. పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దీంతో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తున్నామన్నారు. సోమవారం నుంచి షాపింగ్ మాళ్లు, మార్కెట్లను సరి-బేసి విధానంలో తెరుచుకోవచ్చని చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటలకు షాపులను తెరుచుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో గ్రూప్ ఏ ఆఫీసర్లు వంద శాతం విధులకు హాజరు కావాలన్నారు. ఆ లోపు గ్రేడ్ ఉద్యోగులు 50 శాతం మంది విధులకు రావాల్సి ఉంటుందన్నారు సీఎం కేజ్రీవాల్. 

అత్యవసర సేవల్లో ఉన్న వారు మాత్రం వంద శాతం డ్యూటీలకు రావాల్సి ఉంటుందన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రైవేటు ఆఫీసులను 50 శాతం సిబ్బందితో నడుపుకోవచ్చన్నారు. అయితే.. వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు. అంతేకాదు.. 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ మెట్రో నడుస్తుందన్నారు. ఈ కామర్స్ సేవలనూ ప్రారంభించుకోవచ్చని తెలిపారు.

Tagged Delhi, CM Arvind Kejriwal, Malls, Markets, Odd-Even Basis Open

Latest Videos

Subscribe Now

More News