మనవడి పుట్టినరోజున గిఫ్ట్స్ గొడవ : భార్య, అత్తని చంపిన అల్లుడు..

మనవడి పుట్టినరోజున గిఫ్ట్స్ గొడవ : భార్య, అత్తని చంపిన అల్లుడు..

ఢిల్లీలో కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ సమయంలో గిఫ్ట్స్ విషయంలో ఏర్పడిన  గొడవ వల్ల ఓ వ్యక్తి భార్యను, అత్తని దారుణంగా హత్య చేశాడు. దింతో ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

శనివారం సాయంత్రం 3:50 గంటల సమయంలో ఢిల్లీలోని రోహిణి సెక్టార్-17లోని కేఎన్‌కే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసి తన తల్లి, సోదరి హత్యకు గురయ్యారని చెప్పారు. దింతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కుసుమ్ సిన్హా (63) అలాగే ఆమె కూతురు ప్రియా సెహగల్ (34) మృతదేహాలు ఓ గదిలో ఉన్నట్లు తెలిపారు.

పోలీసుల వివరాలు ప్రకారం  ఆగస్టు 28న మనవడు చిరాగ్ పుట్టినరోజు వేడుకల కోసం అమ్మమ్మ కుసుమ్ సిన్హా కూతురు  ప్రియా ఇంటికి వెళ్ళింది, అక్కడ గిఫ్ట్స్ విషయమై ప్రియా, ఆమె భర్త యోగేష్ మధ్య గొడవ జరగ్గా, ఆ గొడవను సర్దిచెప్పేందుకు కుసుమ్ అక్కడే ఉండిపోయింది. అయితే ప్రియా, యోగేష్ కి  17 సంవత్సరాలు క్రితం పెళ్లి అయ్యింది. 

కొడుకు మేఘ్ సిన్హా ఆగస్టు 30న తన తల్లికి ఫోన్ చేయగా ఆమె కాల్స్ కు స్పందించలేదు. దింతో అతను ప్రియా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు రక్తపు మరకలు చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే అతని తల్లి, సోదరి రక్తపు మడుగులో పడి ఉన్నారని పోలీసులకు తెలిపాడు.

ప్రియా భర్త యోగేష్ సెహగల్ తన తల్లి, సోదరిని హత్య చేసి పిల్లలతో పారిపోయాడని మేఘ్ సిన్హా  ఆరోపించాడు. పోలీసులు యోగేష్ ను అరెస్టు చేసి, హత్యకు సంబంధించిన రక్తపు మరకలున్న దుస్తులు, ఒక కత్తెరను స్వాధీనం చేసుకున్నారు.

కుసుమ్ మరో కొడుకు హిమాలయ "తన తల్లి ఒక రోజు తన సోదరి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిందని, కానీ ఆమె తిరిగి రాలేదని దింతో తరువాత రోజు ఉదయం 11:00 నుండి 12:00 గంటలకు ఫోన్ కాల్స్ చేసిన ఎవరూ తీయలేదని, మధ్యాహ్నం వెళ్లి చూసేసరికి  ఇంటి తాళం మీద రక్తపు మరకలు కనిపించాయని తెలిపాడు. అయితే పోలీసులు ఈ కేసుపై విచారం చేపట్టగా,  క్రైమ్ టీం సహా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహస్తున్నారు.