ఐడీ లేకుండా మా ఏరియాలోకి రావొద్దు

ఐడీ లేకుండా మా ఏరియాలోకి రావొద్దు
  • ఢిల్లీలో వెజిటేబుల్ వ్యాపారిపై దాడి, నిందితుడి అరెస్టు

న్యూఢిల్లీ: ఐడీ కార్డు చూపించలేదంటూ కూరగాయల వ్యాపారిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. బదర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ సలీం అనే కూరగాయల వ్యాపారిని బైక్ పై వచ్చిన వ్యక్తి ఆపి గుర్తింపు కార్డు చూపించాలని డిమాండ్ చేశాడు. ఐడీ కార్డు చూపనందుకు దూషించి దాడి చేశాడు. ఐడీ కార్డు లేకుండా తమ ఏరియాలోకి రావొద్దని హెచ్చరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాడికి పాల్పడిన నిందితుడు ట్రావెల్ ఏజెన్సీలో పని చేసే ప్రవీణ్ బబ్బర్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు 10 మంది కూరగాయల వ్యాపారులను ఐడీ కార్డులు అడిగినట్లు పోలీసులు చెప్పారు. లాక్ డౌన్ రూల్స్ పాటించాలని లేకుటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాళ్లను బెదిరించాడన్నారు. సలీం అక్కడి నుంచి వెళ్లకపోవడంతో ఆగ్రహంతో నిందితుడు దాడి చేసినట్లు చెప్పారు. మతం గురించి అడిగి, కరోనా స్ప్రెడ్ చేస్తున్నారంటూ తనపై దాడికి దిగాడని సలీం ఆరోపించాడు. నిందితుడిపై కేసు పెట్టామని, ఇలాంటి ఘటనలను సహించేది లేదని పోలీసులు చెప్పారు.