
మహిళల కోసం కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించిన మెట్రో ఉచిత ప్రయాణ సౌకర్యం పథకానికి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ రెడ్ సిగ్నల్ వేసింది. ఉచిత ప్రయాణంతో మెట్రోకు ఏటా రూ. 1560 కోట్ల నష్టం వస్తుందని అంచనా వేసింది. పథకానికి సంబంధించి ఎనిమిది పేజీల నివేదిక రూపొందించిన మెట్రో అధికారులు..ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదని చెప్పింది. ఉచిత ప్రయాణ పథకం దుర్వినియోగమవుతుందని హెచ్చరించారు. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎన్నడూ ప్రయాణీకులకు కేటాయించిన దాఖలాలు లేవు.
బీజేపీ మెట్రో ఉచిత ప్రయాణంపై విమర్శలు గుప్పిస్తోంది. నిజంగా కేజ్రీవాల్ సర్కారుకు మహిళా సాధికారతపై దృష్టి ఉంటే గతేడాది ఈ పథకాన్ని ప్రవేశ పెట్టకుండా, ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టినట్లు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించింది.