ఢిల్లీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ వివాదస్పద పోస్టులు…దేశ ద్రోహం కేసు నమోదు పోలీసులు

ఢిల్లీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ వివాదస్పద పోస్టులు…దేశ ద్రోహం కేసు నమోదు పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ మైనార్టీ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లాంఖాన్ పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా కామెంట్లు పోస్ట్ చేసినందుకు ఆయనపై సెక్షన్‌ 124 ఏ( దేశద్రోహం), సెక్షన్‌ 153 ఏ( జాతి వివక్ష వ్యాఖ్యలు) కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జఫారుల్ పై ఈ కేసులను బుక్ చేసినట్లు ఢిల్లీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ ఠాకూర్‌ తెలిపారు. జఫారుల్ చేసిన పోస్టులు మతాల మధ్య చిచ్చుపెట్టేలా, సమాజం వ్యక్తుల మధ్య గొడవలు సృష్టించేలా ఉన్నాయంటూ కంప్లైంట్ లో పేర్కొన్నారు. టెర్రరిస్టులతో లింక్ మానీలాండరింగ్ కేసులున్న ఓ వ్యక్తి పేరులో ఖాన్ అని ఉన్న అతని గురించి పొగుడుతూ జఫారుల్ ఖాన్ పోస్టులు చేశారు. మలేషియాకు పారిపోయిన అతన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అలాంటి వ్యక్తిని ప్రశంసిస్తూ జఫారుల్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఐతే ఈ పోస్టులపై నెటిజన్లు నుంచి తీవ్రమైన విమర్శలు రావటంతో జఫారుల్ ఖాన్ అపాలజీ చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినీ కించ పరిచే ఉద్దేశంతో చేసినవి కావని తప్పు ఉంటే క్షమించాలని కోరారు.