
తమిళ నటుడు ‘పవర్‌స్టార్’ శ్రీనివాసన్ అరెస్ట్ అయ్యారు. బుధవారం (జులై 30న) పోలీసులు (ఆర్థిక నేరాల విభాగం) ఆయనను అరెస్ట్ చేశారు. రూ.1000 కోట్ల రుణం ఇప్పిస్తానని చెప్పి ఓ సంస్థ నుంచి ఆయన రూ.5 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తిరిగి తమ రుణం రాకపోవడంతో, ఆ సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైలో శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే, నటుడు శ్రీనివాసన్ తనకు తాను పవర్‌స్టార్ అని అనౌన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో అతని ఫ్యాన్స్ శ్రీనివాసన్ ను కోలీవుడ్‌లో ఇదే పేరుతో పిలుస్తుంటారు.
పోలీసుల వివరాల ప్రకారం: ఒక కంపెనీకి రూ.1000 కోట్ల రుణం మొత్తాన్ని 30 రోజుల్లో ఇప్పిస్తానని శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ డబ్బులు అందకపోతే, తీసుకున్న రూ.5కోట్లు తిరిగి ఇస్తానని వారికి చెప్పారు. కానీ, ఆ డబ్బులను సినిమా నిర్మాణం మరియు వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుని తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.
Also Read : ‘కింగ్‌డమ్’ ఓవర్సీస్ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమాకు టాక్ ఎలా ఉందంటే?
అంతేకాకండా నటుడు శ్రీనివాసన్ ఇప్పటికీ ఇలాంటి ఆరు కేసుల్లో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. శ్రీనివాసన్ సినిమాల్లో నటిస్తూనే చెన్నైలో ఓ ఫైనాన్స్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ పేరుతోనే ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే శ్రీనివాసన్‌ను కోర్టు రెండుసార్లు 'ప్రకటిత నేరస్థుడు'గా ప్రకటించింది. అయినప్పటికీ 2018 నుండి విచారణకు హాజరుకాకుండా దూరంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Team of @EOWDelhi arrested Tamil actor turned Conman in a ₹5 crore loan fraud case.
— Delhi Police (@DelhiPolice) July 30, 2025
The accused posed as a financier & siphoned off funds taken as advance for arranging ₹1000 crore loan, diverting the amount for film production & personal use.
He was declared a Proclaimed… pic.twitter.com/4C0a3I6Zgh
శ్రీనివాసన్ సినీ ఎంట్రీ:
నటుడు శ్రీనివాసన్ 2010లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2011లో ‘లథిక’ అనే మూవీలో హీరోగా నటించి మెప్పించారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో 60కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా చేస్తూనే, కమెడియన్‌గా పలు సినిమాల్లో కనిపించారు. మరికొన్నింటికి నిర్మాతగానూ వ్యవహరించారు.