డబ్బుల కోసం సెల్ఫ్ కిడ్నాప్.. రంగంలోకి పోలీసులు

డబ్బుల కోసం సెల్ఫ్ కిడ్నాప్.. రంగంలోకి పోలీసులు

న్యూఢిల్లీ: డబ్బుల కోసం ఇతరులను కిడ్నాప్ చేసి బెదిరించిన ఉదంతాల గురించి వినే ఉంటాం. కానీ ఇక్కడో వ్యక్తి డబ్బుల గురించి తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు. వివరాలు.. ఢిల్లీకి చెందిన సుశాంత్ చౌదరి అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేస్ కంపెనీలో ఆపరేట్‌గా పని చేస్తున్నాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌ చేసే అలవాటు ఉన్న సుశాంత్.. అందులో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఆ డబ్బుల్ని రికవర్ చేయాలనుకున్న సుశాంత్ సెల్ఫ్ కిడ్నాప్ డ్రామా ఆడాడు. మీ కొడుకు మా నుంచి 1.5 లక్షలు లోన్‎గా తీసుకున్నాడని.. అందులో ఇంకా సంగం చెల్లించాల్సి ఉందని తన ఫోన్ నుంచి తండ్రికి మెసెజ్‎లు పంపాడు. కొడుకు కోసం తండ్రి డబ్బులు పంపాడు. తర్వాత రెండు రోజులకు మరోసారి డబ్బులు పంపాలంటూ మెసెజ్ రావడంతో.. సుశాంత్ తండ్రి తేజ్ పాల్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. సుశాంత్ బ్యాంక్ స్టేట్‎మెంట్ చెక్ చేస్తే.. ఎక్కువగా ఆన్‌లైన్ ట్రేడింగ్‌ కంపెనీకి డబ్బులు వెళ్లినట్లు గుర్తించారు. తేజ్ పాల్ సింగ్ డబ్బులు పంపిన సుశాంత్ అకౌంట్‎ను ట్రాక్ చేయడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దాంతో డబ్బులు డ్రా చేస్తున్న ఏరియాల్లో పోలీసులు రెక్కీ నిర్వహించడంతో సుశాంత్ పట్టుబడ్డాడు. తాను ఆన్‌లైన్ ట్రేడింగ్‌ లో డబ్బులు పోగొట్టుకున్నానని.. అవి తీర్చడం కోసం అప్పులు కూడా చేసినట్లు సుశాంత్ తెలిపాడు. ఆ అప్పులు తీర్చాలని ఇంట్లో చెబితే.. డబ్బులు ఇవ్వరని.. అందుకు ఇలా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులకు సుశాంత్ తెలిపాడు. దాంతో పోలీసులు.. సుశాంత్‎ను అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు.