పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి చెందిన నలుగురు సభ్యులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. శిక్షణ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఇటీవలే పీఎఫ్ఐపై ఐదేళ్ల పాటు నిషేధం ప్రకటించింది. అనంతరం పీఎఫ్ఐ చర్యలపై నిఘా పెట్టిన కేంద్రం.. పీఎఫ్ఐ సోషల్ మీడియా అకౌంట్‌లపైనా కొరడా ఝుళిపించింది. ఈ మధ్యే పీఎఎఫ్ఐ స్టేట్ సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం బ్లాక్ చేసిన కేంద్రం... కర్ణాటక, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర పీఎఫ్ఐ ట్విట్టర్ అకౌంట్స్ ను డిసబుల్ చేసింది. ఎన్ఐఏ సోదాల అనంతరం ఈ కేసులో చాలా మంది పీఎఫ్ఐ సభ్యులు ఇప్పటికే అరెస్టయ్యారు. 

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలతో సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా (పీఎఫ్ఐ), దానికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలపై కేంద్రం ఇటీవలే నిషేధం విధించింది. టెర్రరిస్ట్ సంస్థలతో లింకులు ఉన్నాయని, దేశంలో ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం, ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేసినట్లు ఆధారాలు దొరకడంతో వీటిని నిషేధించినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద వీటిని ఐదేండ్ల పాటు బ్యాన్ చేస్తున్నామని, నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు తెలిపింది.