ఢిల్లీలో భారీగా భద్రతా బలగాల మోహరింపు

ఢిల్లీలో  భారీగా భద్రతా బలగాల మోహరింపు

జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. కేంద్ర పారమిలటరీ బలగాలతో సహా ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడిక్కడ వాహనాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. స్థానికుల గుర్తింపు పత్రాలపై ఆరా తీశారు. అటు జీ20 సదస్సు దృష్ట్యా దిల్లీ పరిసర ప్రాంతాల వాసులకు పోలీసులు మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. అటు కీలకమైన ఇండియా గేట్ , కర్తవ్యపథ్  ప్రాంతాల్లో నడవటం, సైక్లింగ్  తోపాటు టూరిస్టులకు పర్మిషన్ నిలిపివేశారు. మూడురోజులపాటు అత్యవసరమైతే తప్పా టూర్లను వాయిదా వేసుకోవాలని సూచించారు. దిల్లీలో ఆన్ లైన్  ద్వారా వైద్య సామాగ్రి డెలివరీకి మాత్రమే అనుమతిస్తున్నారు. అటు ఢిల్లీవాసులు వ్యక్తిగత వాహనాల్లో కాకుండా మెట్రోల్లోనే ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 

సెప్టెంబర్ 9, 10న  ఢిల్లీ జరిగే శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా,ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాలాంటి ప్రపంచ అగ్రనేతలతో పాటు 40కిపైగా దేశాల అధినేతలు తరలివస్తున్నారు. ఇవాళ తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ , జపాన్  ప్రధాని కిషిదా మధ్యాహ్నాం ఢిల్లీ చేరుకోనున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సాయంత్రం 7గంటలకు, చైనా ప్రధాని లీ కియాంగ్  రాత్రి  ఢీల్లీ రానున్నారు.

Also Read :- అట్లుంటది మరి.. ధోనీకి ఫోన్ చేసి పిలిపించుకున్న ట్రంప్

అటు సౌదీ అరేబియా, కొరియా, ఈజిప్ట్ , ఆస్ట్రేలియా, యూఏఈ, నెదర్లాండ్స్ , బ్రెజిల్ , ఇండోనేసియా దేశాధినేతలు ఇవాళే రాజధానికి చేరుకోనున్నారు. అటు జర్మనీ చాన్స్ లర్  స్కోల్జ్ , ఫ్రాన్స్  అధ్యక్షుడు మేక్రాన్ రేపు సమావేశాలకు హాజరుకానున్నారు. సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్,  చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ సమ్మిట్ కు హాజరుకావటంలేదు. రష్యాతరపున ఆదేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ బృందం సమ్మిట్ లో పాల్గొననున్నారు.