
ఓపెన్ టెన్నిస్ మ్యాచ్ లు చూసేందుకు ఆమెరికా వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి ఆరుదైన ఆహ్వానం అందింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆట కోసం ధోనీని ఆహ్వానించారు. ఈ విషయాన్ని ధోనీ స్నేహితుడు హితేష్ సంఘ్వి తన ఇన్‌స్టాగ్రామ్ లో వెల్లడించారు.
దీంతో అక్కడికెళ్లిన ధోనీ ఆయనతో సమావేశమయ్యారు. అక్కడ క్రికెట్ సంగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసేపు ఆయనతో కలిసి గోల్ఫ్ ఆడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇందులో ధోనీ గోల్ఫ్ స్టిక్‌తో కనిపిస్తున్నాడు. పక్కనే ట్రంప్ నవ్వుతూ థంబ్సప్ సింబల్ ఇచ్చారు. ఈ ఫొటో వైరల్ అయ్యింది. ధోనీ కాబట్టే ఈ ఇన్విటేషన్ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది చెన్నై జట్టుకు ట్రోఫీని అందించిన ధోనీ క్రికెట్‌కి దూరంగా మిగతా ఆటలతో ఎంజాయ్ చేస్తున్నాడు.