ట్విట్టర్ ఇండియా ఆఫీసులో పోలీసుల సోదాలు

V6 Velugu Posted on May 24, 2021

న్యూఢిల్లీ: ట్విట్టర్ ఇండియా ఆఫీసుల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు ప్రారంభించారు. ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాల్లో ఉన్న ట్విట్టర్ కార్యాలయానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు సోదాలు చేపట్టారు. ఢిల్లీలోని ల్యాడో సరాయిలో ఉన్న ట్విట్టర్ ప్రధాన కార్యాలయంతోపాటు దేశ రాజధాని శివార్లలో గుర్గావ్ లో ఉన్న ట్విట్టర్ కార్యాలయంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కోవిడ్ టూల్ కిట్ వ్యవహారంలో నోటీసులు పంపిన స్పెషల్ పోలీసుల బృందం వాస్తవాలు నిర్ధారించుకునేందుకు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు చేస్తున్నది వాస్తవమేనని ధృవీకరించిన పోలీసులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  
 

Tagged Delhi police, , raids in twitter offices, delhi twitter offices raids, covid toolkit probe, twitter delhi and gurgaon offices, twitter india offices

Latest Videos

Subscribe Now

More News