రోడ్డు నిర్మాణంలో జరిగిన అవినీతిపై ప్రశ్నించిన యువకుడిని చెంప చెళ్లుమనేలా ఓ మంత్రి కొట్టిన వీడియో వైరల్ గా మారింది. అవినీతిపై స్థానికులు ప్రశ్నించడంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి.. ఆ వాగ్వాదానికి సంబంధించి వీడియో తీస్తున్న యువకునిపై చేయి చేసుకున్నారు. 2026 సెప్టెంబర్ 27న ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.
ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రి ప్రవేశ్ వర్మ స్థానిక యువకుడిని చెంపపై కొట్టారని ఆప్ ఆరోపణలు చేసింది. ఈ ఘటన తిలక్ నగర్‌లో జరిగినట్లు పార్టీ తెలిపింది. రోడ్డు నిర్మాణంలో ఉన్న అవకతవకలపై స్థానికులు, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ప్రశ్నించినప్పుడు మంత్రి ఆగ్రహంతో యువకుడిని కొట్టారని ఆప్ వాదిస్తోంది. ఈ వివాదాస్పద 46 సెకన్ల వీడియోను పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
देखिए, जब PWD मंत्री प्रवेश वर्मा का सड़क घोटाला स्थानीय जनता ने कैमरे पर एक्सपोज़ कर दिया तो बौखलाहट में मंत्री जी ने एक स्थानीय युवा को ही थप्पड़ जड़ दिया।
— AAP (@AamAadmiParty) September 27, 2026
लगता है इन भाजपाई गुंडों को Genz की ताक़त का अभी तक एहसास नहीं हुआ है। pic.twitter.com/AkbT1W0ZDr
రోడ్డు స్కామ్ బయటపడిందని ఏఏపీ వాదన
తిలక్ నగర్ స్థానికులు, ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ రోడ్డు నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఈ ఘర్షణ మొదలైందని ఆప్ చెబుతోంది. రోడ్డు 70 మి.మీ. మందం ఉండాల్సి ఉండగా తక్కువ మెటీరియల్ వాడారని పార్టీ ఆరోపించింది. ఈ అవకతవకలను కెమెరాలో రికార్డ్ చేస్తుండగా మంత్రి కోపగించుకున్నారని తెలిపారు.
►ALSO READ | అస్సాం ప్రభుత్వం కాక్రోచ్ లకు భయపడుతోంది : సీజీపీ కో కన్వీనర్ అశుతోష రంకా
ఈ వీడియోను ఉపయోగించి ఏఏపీ, బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని.. రోడ్ల నాణ్యత మరీ దారుణంగా ఉందని ఈ వీడియో ఆధారంగా ప్రభుత్వంపై ఆప్ దాడి చేస్తోంది. స్థానికులు ప్రశ్నించినందుకే మంత్రి చేయి చేసుకుంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
