ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో తవ్వేకొద్ది సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ ఎర్ర కోట దగ్గర బ్లాస్ట్ కు పాల్పడిన దుండగులు.. ఆ ఒక్క చోట పేలుడుతో ఆగకుండా.. ఢిల్లీ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) లేటెస్ట్ విచారణ లో వెల్లడించింది. బుధవారం (నవంబర్ 19) రిలీజ్ చేసిన రిపోర్ట్ లో.. నిందితులు హమాస్ ఉగ్రవాదుల తరహా బ్లాస్టింగ్ కు ప్లాన్ చేసినట్లు పేర్కొంది.
హమాస్ స్టైల్ లో ఆయుధాలతో కూడిన డ్రోన్స్, పేలుళ్ల కోసం ప్రత్యేకంగా చేసిన రాకెట్స్, ప్రొజెక్టైల్స్ ద్వారా.. ఏకకాలంలో ఢిల్లీ వ్యాప్తంగా భారీగా పేలుళ్లు జరిపేందుకు పర్ఫెక్ట్ ప్లాన్ చేసినట్లు నివేధిక వెల్లడించింది.
ఈ బ్లాస్ట్ ను జసిర్ బిలాల్ వని అలియాస్ డానిష్ ఆధ్యర్యంలో పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు శ్రీనగర్ లో అరెస్టు చేశారు. అమిర్ రషీద్ అలీని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న తర్వాత డానిష్ ను పట్టుకున్నారు దర్యాప్తు అధికారులు. ఇద్దరూ జమ్మూ, కశ్మీర్ కు చెందిన వారే కావడం గమనార్హం.
NIA నివేదిక ప్రకారం.. డానిష్ మాడ్యూల్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్ , డ్రోన్స్ ను రిపేర్ చేయడం, పేలుళ్ల కోసం రాకెట్స్ ను అభివృద్ధి చేయడం మొదలైన పనుల్లో దిట్ట. వారం రోజులకు ముందే ఈ ఆయుధాలను ఇంప్రువైస్ చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఆయుధాలతో కూడిన చిన్న చిన్న డ్రోన్స్ తయారు చేయడంలో డానిష్ ఎక్స్ పర్ట్ అని పేర్కొంది.
హమాస్ స్టైల్ ఆయుధాలు..?
తక్కువ బరువుతో.. ఈజీగా మూవ్ అయ్యే విధంగా డ్రోన్స్, రాకెట్స్ ను తయారు చేయడంలో హమాస్ ఉగ్రవాదులది అందెవేసి చేయి. మందు సామాగ్రిని 25 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లడం.. చేతులతోనే, రిమోట్ తో పేల్చేయడం మొదలైన ఆధునిక టెక్నాలజీతో బాంబులను, ఆయుధాలను, డ్రోన్స్ ను తయారు చేస్తుంటారు. ఒక బాంబును 20 సెకన్లలో, అదే మూడింటిని కేవలం నిమిషంలోనే ప్రయోగించే విధంగా డెవలప్ చేసి ప్రయోగిస్తుంటారు. అలాంటి టెక్నాలజీ, అలాంటి నేర్పుతోనే ఢిల్లీ బ్లాస్ట్ కు ప్లాన్ చేసినట్లు NIA నివేదిక ద్వారా వెల్లడించిందిజ
