లిక్కర్ కేసు: కవితకు మూడు రోజుల సీబీఐ కస్టడీ

లిక్కర్ కేసు: కవితకు మూడు రోజుల సీబీఐ కస్టడీ

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు  మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.  దీంతో కవిత ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీలో ఉండనుంది. కవితను కాసేపట్లో సీబీఐ హెడ్ క్వార్టర్ కు తరలించనున్నారు. 

లిక్కర్ స్కాంలో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత ఏప్రిల్ 12న  పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన  కోర్టు పిటిషన్ ను కొట్టేసింది. అలాగే మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.  ఐదు రోజులు  కస్టడీకి  ఇవ్వాలని సీబీఐ కోర్టును  కోరింది. దీంతో కవితను  మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.