ఢిల్లీలో రేపటి నుంచి స్కూళ్లు మూసివేత

ఢిల్లీలో రేపటి నుంచి స్కూళ్లు మూసివేత

వాయు కాలుష్యం కారణంగా  ఢిల్లీలో  రేపటి ( శుక్రవారం) నుంచి  స్కూళ్లు  మూసివేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని కేంద్ర విద్యాశాఖ  మంత్రి గోపాల్‌ రాయ్ తెలిపారు. కాలుష్య పరిస్థితుల్లో వాటిని తిరిగి తెరవడంపై  ఇవాళ ఢిల్లీ ప్రభుత్వంపై  సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. మూడు, నాలుగేళ్ల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు.. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

'గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకొని మేం పాఠశాలలను తిరిగి ప్రారంభించామని తెలిపారు  మంత్రి గోపాల్ రాయ్. అయితే వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయన్నారు. ఈ క్రమంలోనే  తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూళ్లను  శుక్రవారం నుంచి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.