- ఢిల్లీలో మొత్తం 60 జోన్లు
న్యూఢిల్లీ: సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిర్వహించిన యాంటీ ప్రొటెస్ట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుపొందిన షాహీన్‌బాగ్ ఏరియాను అధికారులు కరోనా హాట్‌స్పాట్‌గా గుర్తించారు. పోయిన ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అక్కడ ఆందోళనలు కొనసాగాయి. ఢిల్లీలో ఆందోళనలపై నిషేధం విధించిన ఆందోళనకారులు వినకుండా నిరసన చేపట్టడంతో అధికారులు వారిని బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించారు. షాహీన్‌బాగ్ ఏరియాలో కేసులు ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని హాట్‌స్పాట్ లిస్ట్‌లో చేర్చినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఢిల్లీలో హాట్‌స్పాట్ జోన్లు 60కి చేరాయి. హాట్‌స్పాట్ జోన్లలో అధికారులు ప్రతి ఇంటిని శానటైజ్ చేసి.. డోర్ టూ డోర్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు చెప్పారు. గత 15 రోజులుగా మూడు లొకేషన్స్‌లో ఒక్క కేసు నమోదు కాలేదని ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ అన్నారు. ఢిల్లీలో శుక్రవారానికి 1640 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇప్పటి వరకు 38 మంది చనిపోగా.. గురువారం ఒక్కరోజే 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.
