
ఢిల్లీలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆర్థిక సహాయం ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ . గతేడాది మాదిరిగానే.. ఈసారి కూడా ఢిల్లీలోని ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేల రూపాయలను సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాదు ఢిల్లీలో నివసిస్తున్న 72 లక్షల రేషన్ కార్డుదారులకు వచ్చే రెండు నెలల పాటు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని.. ఒకరికొకరు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు సీఎం కేజ్రీవాల్.