
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు కొత్తగా 1,118 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసులతో పోలిస్తే 82 శాతం కంటే ఎక్కువ కేసులు పెరిగాయి. అటు కొత్తగా రెండు కరోనా మరణాలు సంభవించగా, 500 మంది కరోనా నుంచి కొలుకున్నారు. పాజిటివిటీ రేటు 6.50 శాతంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో3,177 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. అటు దేశంలో కరోనా కేసుల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా కొత్తగా 6,594 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 50,548 యాక్టివ్ కేసులున్నాయి. కేసులు పెరుగుతన్న అందరూ మళ్లీ కరోనా నిబంధనలు తప్పక పాటించాలని, టెస్టుల సంఖ్యనూ పెంచాలని ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది.