
లాక్‌డౌన్ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న వర్సిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని యూజీ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌ను పూర్తిగా రద్దు చేశారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్నందున లాక్‌డౌన్ విధించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెప్పాయి. ఈ నిర్ణయంతో యూజీ ఫస్ట్, సెకెండ్ ఇయర్‌కు చెందిన మూడు లక్షల మంది, పీజీ ఫస్ట్‌ఇయర్‌కు చెందిన 12వేల మంది స్టూడెంట్స్‌కు పరీక్షలు ఉండవు. “ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెన్ అండ్ పేపర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించడం వీలుకాదు. దీనికి ప్రత్యామ్నాయ మార్గమైన గ్రేడింగ్ పద్ధతిని ఎలా అమలు చేయాలనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం” అని ఢిల్లీ యూనివర్సిటీ వర్గాలు చెప్పాయి. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్, నాన్ కాలేజియట్ ఉమెన్ ఎడ్యుకేషన్ బోర్డు, ఎన్‌సీడబ్ల్యూఈబీ కింద రిజిస్టర్ చేసుకున్నవాళ్లకు కూడా రెగ్యులర్ స్టూడెంట్స్‌కు గ్రేడ్స్ ఇచ్చినట్లుగానే ఇస్తామని చెప్పారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఎక్స్‌స్టూడెంట్స్ మాత్రం పరీక్షలకు హాజరుకావాలని యూనివర్సిటీ ప్రకటన రిలీజ్ చేసింది.