
తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదం ఢిల్లీని తాకింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ ముందు ‘ఢిల్లీ యూనివర్సిటీ’ విద్యార్థులు నిరసన తెలిపారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ.. DU విద్యార్థులు ధర్నా చేశారు.
“రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విద్యార్థుల చావులకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. న్యాయ విచారణ జరిపించాలి. విద్యార్థుల వల్ల వచ్చిన తెలంగాణలో ఇప్పుడు విద్యార్థుల చావులు జరుగుతున్నాయి” అని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలిపారు.