2023 G20 summit:జీ–20 సదస్సుకు ముస్తాబువుతున్న ఢిల్లీ

2023 G20 summit:జీ–20 సదస్సుకు ముస్తాబువుతున్న ఢిల్లీ

2023లో జరగనున్న జీ20 సమ్మిట్‭కు ఢిల్లీ మహానగరం ముస్తాబవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని గోడలకు పెయింటింగ్ వేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. రాజ్ ఘాట్‭లోని గాంధీ దర్శన్‭లో గోడలపై వేసిన కుడ్య చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు డంప్ యార్డ్ కారణంగా ప్రజలు గాంధీ దర్శన్ వైపు వెళ్లేవారుకాదు. కాని ఇప్పుడు అది రంగురంగుల గోడలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  

నారింజ, ఆకుపచ్చ రంగులతో వేసిన జీ20 లోగో అందరినీ ఆకట్టుకుంటోంది. రష్యాలోని సెయింట్ బాసిల్ కేథడ్రల్‭ను ధలావో భవనం అంచున ఎత్తుగా చూపించారు. దానికి సమీపంలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పారిస్ ఈఫిల్ టవర్ ఉన్నట్లు పెయింటింగ్ వేశారు. జీ20 సమ్మిట్ కోసం నగరాన్ని కళాత్మక కుడ్యచిత్రాలతో అలంకరిస్తున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. చాలా ప్రదేశాల్లో గోడలపై అందమైన పెయింటింగ్ వేయించామని ఆయన చెప్పారు. డంప్ యార్డ్ గోడలను కూడా అందంగా అలంకరిస్తున్నామని అన్నారు. సిడ్నీ ఒపేరా హౌస్, ఇటలీ రాజధాని నగరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొలోసియం ఆఫ్ రోమ్, బెర్లిన్‌లోని బ్రాండెన్‌ బర్గ్ గేట్, రియో డి జనీరెలోని యేసు క్రీస్తు విగ్రహం క్రైస్ట్ ది రిడీమర్ తదితర చిత్రాలన్నింటినీ పెయింటింగ్‭తో కళ్లకు కట్టినట్లు చూపారు.