న్యూఢిల్లీ: వెహికల్ పార్టులు తయారు చేసే అమెరికన్ కంపెనీ టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా లిమిటెడ్, ఈ నెల 12న తన రూ.3,600 కోట్ల ఐపీఓను ప్రారంభించనుంది. ఇది 14న ముగుస్తుంది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉంటుంది. కొత్త షేర్ల జారీ ఉండదు. దీంతో ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ కంపెనీకి కాకుండా ప్రమోటర్ టెనెకో మారిషస్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కి వెళతాయి.
ప్రమోటర్లలో టెనెకో మారిషస్ హోల్డింగ్స్ లిమిటెడ్, టెనెకో (మారిషస్) లిమిటెడ్, ఫెడరల్‌మొగల్ ఇన్వెస్ట్‌మెంట్స్ బీవీ, ఫెడరల్‌మొగల్ పీటీవై లిమిటెడ్, టెనెకో ఎల్‌ఎల్‌సీ ఉన్నాయి. టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా బండ్ల కోసం ఎమిషన్ కంట్రోల్, ఎగ్జాస్ట్ టెక్నాలజీ, పవర్‌ట్రెయిన్, సస్పెన్షన్ వంటివి తయారు చేస్తుంది. కంపెనీ ఐపీఓని జేఎం ఫైనాన్షియల్, సిటీ గ్రూప్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ ఇండియా నిర్వహిస్తున్నాయి.
