
షార్జా: ఫుల్ స్వింగ్‌తో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ యంగ్ గన్స్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38 బాల్స్‌లో 88 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు), పృథ్వీ షా (41 బాల్స్‌లో 66, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (17 బాల్స్‌లో 38, 5 ఫోర్లు, 1 సిక్స్) ఐపీఎల్‌లో దంచికొట్టారు. ఎదురుగా టాప్ బౌలర్లు ఉన్నా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఫలితంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 18 రన్స్ తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 228/4 స్కోరు చేసింది. భారీ టార్గెట్ ఛేజ్ చేసే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 210 రన్స్ చేసింది. నితీశ్ రాణా (35 బాల్స్‌లో 58, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. మ్యాచ్ లాస్ట్‌లో మోర్గాన్ (44), త్రిపాఠి (36) విజృంభించడంతో కాసేపు విజయం కేకేఆర్ వైపు మొగ్గింది. కానీ నోర్జ్ (3/33) అద్భుతమైన బౌలింగ్‌తో రన్స్ కట్టడి చేయడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది. ఆరంభంలో నరైన్ (3) విఫలమైనా.. గిల్ (28), రాణా దంచికొట్టడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 59/1 స్కోరు చేసింది. అయితే గిల్ ఔట్‌కావడంతో రెండో వికెట్‌కు 64 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. రసెల్ (13) విఫలమయ్యాడు. 13వ ఓవర్‌లో వరుస బంతుల్లో రాణా, కార్తీక్ (6) ఔట్‌కాగా, తర్వాతి ఓవర్‌లో కమిన్స్ (5) వెనుదిరిగాడు. 15 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 137/6 కావడంతో విజయ సమీకరణం 30 బాల్స్‌లో 92 రన్స్‌గా మారింది. క్రీజులో మోర్గాన్ , త్రిపాఠి ఉండటంతో గెలుపుపై కొద్దిగా ఆశలు పెట్టుకున్నారు. రబడ వేసిన 16వ ఓవర్‌లో మోర్గాన్ 4, 6తో రెచ్చిపోయాడు. త్రిపాఠి.. స్టోయినిస్ వేసిన తర్వాతి ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 6తో 24 రన్స్ పిండుకున్నాడు. ఆ వెంటనే రబడ బౌలింగ్‌లో మోర్గాన్ వరుసగా 6, 6, 6తో పాటు బౌండ్రీ బాదడంతో 23 రన్స్ వచ్చాయి. ఇక కేకేఆర్ గెలవాలంటే 12 బాల్స్‌లో 31 రన్స్ అవసరమైన దశలో మోర్గాన్ ఔటయ్యాడు. లాస్ట్ ఓవర్‌లో 27 రన్స్ అవసరం కాగా, 7 రన్సే వచ్చాయి.
మెరుపులే.. మెరుపులు
ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ, ధవన్ (26) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఫస్ట్ ఓవర్‌లోనే బౌండ్రీతో పృథ్వీ దూకుడు మొదలుపెట్టగా, రెండో ఎండ్‌లో ధవన్ కూడా కంటిన్యూ చేశాడు. మూడో ఓవర్‌లో పృథ్వీ 4, 6తో 13 రన్స్ రాబడితే, నరైన్ వేసిన ఐదో ఓవర్‌లో ధవన్.. రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. కానీ ఆరో ఓవర్‌లో వరుణ్.. ధవన్ వికెట్ తీసి కోల్‌కతాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. దాంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 57/1 స్కోరు చేసింది. ఇక పృథ్వీతో జతకలిసిన శ్రేయస్ కూడా జోరు తగ్గకుండా చూశాడు. ఏడో ఓవర్‌లో సింగిల్స్‌తో నాలుగు రన్సే చేసినా.. తర్వాతి ఓవర్‌లో పృథ్వీ సిక్సర్, శ్రేయస్ ఫోర్ కొట్టడంతో 14 రన్స్ వచ్చాయి. 10వ ఓవర్ (నరైన్) మిడ్ వికెట్‌లో సిక్సర్ కొట్టిన శ్రేయస్ టీమ్ స్కోరును 89/1కు పెంచాడు. నాగర్‌కోటి వేసిన 11వ ఓవర్‌లో చెరో సిక్సర్ బాదారు. ఈ క్రమంలో పృథ్వీ 35 బాల్స్‌లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. తర్వాతి ఓవర్‌లోనూ పృథ్వీ 4, శ్రేయస్ 6, 4 బాదడంతో మరో 16 రన్స్ వచ్చాయి. అయితే 13వ ఓవర్ ఫస్ట్ బాల్‌ను మిడ్ వికెట్‌లో సిక్స్‌గా మల్చిన పృథ్వీ నాలుగో బాల్‌కు ఔటయ్యాడు. ఫలితంగా రెండో వికెట్‌కు 73 పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. ఈ టైమ్‌లో రిషబ్ ఉన్నంతసేపు దంచికొట్టాడు. 15 ఓవర్లలో 151/2తో ఉన్న ఢిల్లీ స్కోరును 200లు దాటించాడు. మావి వేసిన 16వ ఓవర్‌లో ఇద్దరు కలిసి 4, 4, 4, 4తో 18 రన్స్ దంచారు. 17వ ఓవర్ (కమిన్స్) శ్రేయస్ 6, 4, 4తో 17 రన్స్ రాబట్టాడు. రసెల్ (18వ) ఓవర్‌లో వరుసగా 6, 4, 4తో రెచ్చిపోయిన రిషబ్.. ఐదో బాల్‌కు ఔటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 72 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. లాస్ట్ రెండు ఓవర్లలో స్టోయినిస్ (1) ఔటైనా, శ్రేయస్ 4, 6, 6, హెట్‌మయర్ (7 నాటౌట్).. 6 బాదడంతో 27 రన్స్ వచ్చాయి.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 228 /4 (శ్రేయస్ 88 నాటౌట్, పృథ్వీ షా 66, పంత్ 38, రసెల్ 2/29). కోల్‌కతా: 210/8 (రాణా 58, మోర్గాన్ 44, త్రిపాఠి 36, నోర్జ్ 3/33).