భారీ వర్షాలు..మళ్లీ డేంజర్ మార్క్ దాటిన యమునా నది

భారీ వర్షాలు..మళ్లీ డేంజర్ మార్క్ దాటిన యమునా నది

ఢిల్లీలో మళ్లీ యమునా నదికి వరద పోటెత్తుతోంది. హిమాచల్ ప్రదేశ్ , హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలోని యమున నది డేంజర్ లెవల్ దాటి  ప్రవహిస్తోంది. ఢిల్లీ పరిసరాల్లో 205 మీటర్లకు మించి వరద ఉధృతి కొనసాగుతోంది. అటు ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద ప్లడ్ 205.33 మీటర్లకు చేరుకుంది. మరోవైపు హర్యానా హత్నీకుండ్  బ్యారేజీ నుంచి 30 వేలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో దిల్లీలో మరోసారి వరదలు వచ్చే  చాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల ఎఫెక్ట్ తో హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని  ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటించింది.

యమునా నది ఉధృత ప్రవాహంతో లోతట్టుకాలనీలను అధికారులు అలర్ట్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సురక్షితప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.