దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి డేంజర్ బెల్స్ మోగాయి. ఢిల్లీలో గాలి కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో పడిపోయింది. ఆదివారం(అక్టోబర్ 20)ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ దట్టమైన పొగమంచు కనిపించింది. చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కంటే ఎక్కువగా నమోదు అయింది.
అక్షర్ ధామ్ ఆలయం, దాని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 353గా నమోదు అయింది. ఆనంద్ విహార్ లో AQI 454 పడిపోయింది.సెంట్రల్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) ప్రకారం..ఇది అత్యంత పేలవమైనది.
పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్స్ (GRAP) దశ1ని అమలు చేస్తుంది. ఇది పీక్ పీరియడ్స్ లో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఒక నియంత్రణ చర్య.