దగ్గు రాకున్నా.. దగ్గితే సస్పెన్షనే

దగ్గు రాకున్నా.. దగ్గితే సస్పెన్షనే

లండన్‌‌‌‌: కరోనా వల్ల ఆగిపోయిన జన జీవనం మెల్లమెల్లగా స్టార్టవుతోంది. ఒక్కొక్క దానికి ప్రభుత్వాలు అనుమతిస్తూ వస్తున్నాయి. చాలాచోట్ల స్కూళ్లనూ తెరుచుకొమ్మని ఆదేశాలిస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌‌‌‌లోనూ ఆగస్టు 31 నుంచి స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తూర్పు ససెక్స్‌‌‌‌లోని ఆర్క్‌‌‌‌ అలెగ్జాండ్రా అకాడమీ ప్రత్యేకంగా కొవిడ్‌‌‌‌ రూల్స్‌‌‌‌ రెడీ చేసింది. ‘క‌‌‌‌రోనా వైర‌‌‌‌స్ రెడ్ లైన్స్’ పేరుతో రిలీజ్‌‌‌‌ చేసిన ఈ రూల్స్‌‌‌‌ పాటించకపోతే సస్పెండ్‌‌‌‌ చేసేదాకా కూడా వెళ్తామని స్పష్టంచేసింది. ఇప్పుడీ విషయం సోషల్‌‌‌‌ మీడియాలో హాట్‌‌‌‌ టాపిక్‌‌‌‌గా మారింది. ‘దగ్గు రాకుండా గనక స్టూడెంట్లు ఎవరైనా దగ్గినా, తుమ్మినా, కరోనాకు సంబంధించి జోక్‌‌‌‌లు వేసినా, కావాలని ఎవరినైనా తాకినా, రూల్స్‌‌‌‌ను అస్సలు పాటించకపోయినా చర్యలు తీసుకుంటాం. సస్పెండ్‌‌‌‌ చేస్తాం’ అని పేర్కొంది. స్టూడెంట్లకు కేటాయించిన ప్లేస్‌‌‌‌లలో భోజనం చేయకుంటే డిసిప్లనరీ యాక్షన్స్‌‌‌‌ తీసుకుంటామంది. ఇంకొన్ని స్కూళ్లు స్టూడెంట్లు పీపీఈ కిట్లు వేసుకొని రావాలని సూచించాయి.

వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడిక్కడే ఐదుగురు మృతి