నర్సుతో డెలివరీ.. శిశువు మృతి? ..హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

నర్సుతో డెలివరీ.. శిశువు మృతి? ..హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

నాచారం, వెలుగు: డ్యూటీ డాక్టర్​ చేయాల్సిన పనిని స్టాఫ్​ నర్సుతో చేయించడం వల్ల ఓ శిశువు మృతిచెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మల్లాపూర్​ బాబానగర్ కు చెందిన గుడిసె కవిత(20) గురువారం సూర్య నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి డెలివరీ కోసం వెళ్లారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు స్టాఫ్ నర్సుతో డెలివరీ చేయించారు. 

డెలివరీ అయిన శిశువు కాసేపటికే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ డీఎంహెచ్​వో హాస్పిటల్​కు చేరుకొని శిశువు మృతిపై ఆరా తీశారు. విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.