అమెరికా బ్రాండ్ కు దెబ్బ ... టారిఫ్ లపై మాజీ జాతీయ భద్రతా సలహాదారు సలివాన్

అమెరికా బ్రాండ్ కు దెబ్బ ... టారిఫ్ లపై మాజీ జాతీయ భద్రతా సలహాదారు సలివాన్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌‌లు అమెరికా బ్రాండ్​ను దెబ్బతీస్తున్నాయని ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ విమర్శించారు. ఓ పాడ్‌‌కాస్ట్‌‌లో ఆయన మాట్లాడారు. "భారత్‌‌పై 50% టారిఫ్‌‌లు ఆ దేశంతో అమెరికా సంబంధాలను దెబ్బతీస్తున్నాయి.  టారిఫ్​ల అమలు వల్ల అమెరికాను ప్రపంచ దేశాలు విధ్వంసకారిగా  చూస్తున్నాయి. 

ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికన్ బ్రాండ్ దెబ్బతింటున్నది. అదే టైంలో  చైనా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంపాదిస్తోంది. చైనాను ఎదుర్కొనేందుకు గతంలో అమెరికా ఢిల్లీతో సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేసింది. కానీ ఇప్పుడు ట్రంప్ సుంకాల వల్ల భారత్ మళ్లీ చైనాకు దగ్గరవుతున్నది. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, రష్యా నుంచి చమురు కొనవద్దని భారత్​పై చేస్తున్న ఒత్తిడి, టారిఫ్​లు 50% కి పెంచడం ఆ దేశాన్ని అమెరికా నుంచి దూరం చేసింది" అని జేక్ సలివాన్ పేర్కొన్నారు.