
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సభలో మంత్రి శ్రీధర్ బాబు బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. రిజర్వేషన్లపై 50 శాతాన్ని ఎత్తివేస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు బిల్లును సవరిచాలని కోరారు.