
- 4 లోపే పూర్తిచేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎం పోస్టుల ప్రమోషన్లతో ఏర్పడిన ఖాళీల భర్తీకి విద్యా శాఖ చర్యలు ప్రారంభించింది.విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు అవసరమైన చోట టీచర్లను సర్దుబాటు చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఉన్న టీచర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని సెప్టెంబరు 4 లోపు సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.