యాదగిరిగుట్ట ఈఓగా వెంకట్రావు

యాదగిరిగుట్ట ఈఓగా వెంకట్రావు

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానం, శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్​కల్చరల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) గా సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకట్​రావును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించింది. ఈ మేరకు శనివారం సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వెంకట్ రావు ఎండోమెంట్ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈఓగా కొనసాగుతున్నారు.

 ఆయన ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్ రావును తిరిగి  యాదగిరిగుట్ట ఈఓగా కొనసాగేలా ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి నియమ, నిబంధనలను త్వరలో వెలువరించనున్నారు.